సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టం పై 1.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్టు ఐఎండీ పేర్కొంది. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్ర , రాయలసీమ, తమిళనాడు, నేడు, రేపు సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో చలిగాలుల ప్రభావం మరింత పెరిగింది. ముఖ్యముగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి..
