సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలం తరువాత ఈనెల 13న రాజమండ్రి లో దిగి అటుగా భీమవరం చేరుకునేలా ఎంపీ రఘురామా కృష్ణంరాజు ప్రణాళిక చేసుకొన్నారు. గత అనుభవాల దృష్ట్యా.. ముందు జాగ్రత్తగా.. సంక్రాంతి పండుగకి తమ ఊరు భీమవరం వెళతానని తనకు రక్షణ కల్పించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంపీ రఘురామపై గతంలో 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు ఉమేష్ చంద్ర, వై.వి. రవిప్రసాద్ పిటిషన్లో పేర్కొన్నారు. ‘‘గతంలో సీఐడీ అధికారులు ఎంపీ రఘురామా ను అరెస్టు చేసి చిత్రహిం సలకు గురి చేశారు. మరోసారి ఎదో ఒక కేసులో అరెస్టు చేసే అవకాశముంది. కాబ్బటి ’41ఏ నిబంధనలు ప్రకారం ఆయనకు రక్షణ ఇవ్వాలని అని కోర్టును అభ్య ర్థించారు. అయితే రఘురామకృ ష్ణరాజు పిటిషన్ కు అసలు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కేసు నమోదై, ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబం ధనలు వర్తిస్తాయన్నారు. తాజాగా ఆయనపై కొత్తగా ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మా సనం రేపు దీనిపై తన నిర్ణయం తెలుపుతానని ప్రకటించింది.
