సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ స్థానంలో కొత్తగా బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావించిన వైసిపి పార్టీ ఆ దిశగా కసరత్తు చేసింది.తాజగా విడుదల చేసిన వైసీపీ మూడో జాబితాలో ఏలూరు పార్లమెంటు స్థానానికి ఇన్‌చార్జిగా తణుకు ఎమ్మెల్యే , మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్‌కుమార్‌కు అవకాశం వచ్చింది. ఆయనకు కడప బంధుత్వం కలిసి వచ్చింది. అలాగే చింతలపూడి ఇన్‌చార్జిగా భీమవరం కు చెందిన శాసనమండలి మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు వియ్యంకుడు, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.విజయరాజును నియమించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క నరసాపురం పార్లమెంటు సిటు సిట్టింగ్ ఎంపీ రఘురామా కృష్ణంరాజు స్థానంలో ఎవరిని అభ్యర్థిగా నియమిస్తారో తెలవలసి ఉంది.. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. భీమవరం కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు కానీ మాజీ ఎంపీ ,స్వర్గీయ, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ని కానీ పోటీలో దింపే యోచనలో వైసిపి అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *