సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఏపీలో కొత్తగా 3 రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. వీటిలో 2 రైళ్లు పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా ప్రయాణిస్తాయి. వీటిలో నర్సాపూర్ – హుబ్లీ మధ్య నడిచే రైల్ అయితే భీమవరం మీదుగా ఉంటుంది, కేంద్రమంత్రి, కిషన్‌రెడ్డి నేడు, శుక్రవారం నాడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరు నుంచి ఈరోజు ( శుక్రవారం) మూడు రైళ్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గుంటూరు – విశాఖ, నర్సాపూర్ – హుబ్లీ, రేణిగుంట – కడప రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు నుంచి వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రైల్వే విద్యుదీకరణ కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో అన్ని లైన్లను విద్యుదీకరణ చేశామని చెప్పారు. 371 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని ఏపీలో నిర్మించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *