సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రతిపక్ష నేత, చంద్రబాబుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. భేటీ అనంతరం వైఎస్ షర్మిల మీడియా తో మాట్లాడుతూ.. ‘ నా కుమారుడు పెళ్లికి ఆహ్వానించాను .. గతంలో నాన్న వైఎస్ ఆహ్వానం మేరకు చంద్రబాబు మా పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వదించారు. నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చాను. వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చెప్పారు. మాకు.. ఆయనకు రాజకీయ సంబంధాలు లేవు, ఉండవు, ఉండకూడదు, ఉండబోవు. మా మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంది’ అని షర్మిలఅన్నారు. ‘ మా భేటీలో నాన్న వైఎస్ఆర్‌తో తన స్నేహం గురించి అనుబంధం గురించి చంద్రబాబు గుర్తు చేశారు. ఇతర నేతలకు పంపినట్లే.. నారా లోకేశ్‌కు కూడా ఇటీవల క్రిస్మస్ కేక్ పంపించాను. కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావుకు కూడా స్వీట్లు పంపాం.రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న రాజశేఖరరెడ్డి ఆశయం త్వరలో నిరవేరుతోంది’ అని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *