సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: గత వారం రోజుల కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నుండి కోలుకొని తిరిగి పార్టీ నేతలు తో సమావేశం అవుతున్నారు. అందులో భాగంగా.. నేడు, మంగళవారం చంద్రబాబుకు గుడివాడలో క్యాసినో నిర్వహణపై టీడీపీ కమిటీ తన నివేదిక అందించింది. వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని కమిటీ పేర్కొంది. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని కమిటీ సూచించింది. చంద్రబాబుతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వర్ల రామయ్య, ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత భేటి అయ్యి మంత్రి కొడాలి నాని తీరును తీవ్ర స్థాయిలో విమర్శించి, కొడాలి నానిని చంపడానికి కూడా సిద్ధమని ప్రకటించి గత రాత్రి అరెస్ట్ అయ్యి వెంటనే స్టేషన్ బెయిల్ ఫై బయటకు వచ్చిన బుద్ధా వెంకన్న.. తదుపరి పరిణామాలు ఫై. అధికార వైసిపి నేతలను ఎదుర్కోవలసిన తీరుపై వారు సమీక్షించుకోవడం జరిగింది.
