సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం సమీపంలో ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) శిక్షణా కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మంగళవారం ప్రారంభించారు. నాసిన్ హెలిప్యా డ్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి సీత లక్ష్మణ సమేత శ్రీరాముని జ్ఞాపిక ను సీఎం జగన్ అందజేశారు. ఈ సందర్భంగా మోడీ ,మాటలాడుతూ.. ‘‘ పరిపాలనా దక్షతకు శ్రీరాముడు మారుపేరు అని, రామరాజ్యం మనందరికీ ఆదర్శప్రాయం ఆయన పాలన ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ. 720 కోట్ల వ్యయంతో నిర్మించిన నాసిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) శిక్షణా కేంద్రం ప్రముఖ ట్రైనింగ్ సెంటర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుపరిపాలనకు నాసిన్ సరికొత్త కేంద్రంగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీకి నాసిన్ లాం టి వరల్డ్ క్లాస్ ఇన్స్టట్యూట్ రావడం గర్వంగా ఉంది నాసిన్ తో ఏపీకి ప్రపంచస్థాయి గుర్తింపు రానుంది ఏపీ పేరును నాసిన్ అంతర్జాతీయం గా నిలబెట్టనుంది నాసిన్ అకాడమీని ఏర్పా టు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అన్నారు. అంతక్రితం లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. స్వామి వారిని దర్శించుకున్నారు.
