సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు కనుమ పండుగ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ జోష్ మరింత పెరిగింది. తెలుగు సంస్కృతి సంప్రదాలయాలకు గోదారమ్మ ఒడిలో సేదతీరే పచ్చని కోనసీమ లో అచ్చమైన సంక్రాంతి పండుగ ఈసారి కనివిని ఎరుగని రీతిలో ఈసారీ మరింత సందడి కనపడింది. ఒక ప్రక్క ఇంటింటా సంక్రాంతి ముగ్గులు.. మరో ప్రక్క ప్రతి ఇంటా బంధుమిత్రుల కోలాహలాలు తోటలలో కోడిపందాల జూడాలు సందడి.. వీటన్నిటికంటే గొప్పది.. 400 ఏళ్ళు ఏళ్ళు నుండి వస్తున్నా సంప్రదాయం, నేటి పల్లెపాలెం, అంబాజీపేట,జగ్గన్న తోట లలో భారీ ప్రభలతో జరిగే తీర్ధం.. పల్లెపాలెం కు సమీపంలో ముమ్ముడివరం నుండి నుండి విశేషంగా ప్రభలు బయలు దేరాయి. స్థానిక ప్రసిద్ధ పురాతన శివాలయం శ్రీ ఆదిశంకరాచార్యులతో నిర్మితమైనదిగా భావించే శ్రీ ఉమా సూర్యేశ్వర స్వామి దేవాలయం, సుబ్రమణేశ్వర , అయ్యప్ప దేవాలయాల నుండి ఒకేసారి 3 ప్రభలు బయలు దేరాయి. ఇంకా చుట్టు ప్రక్కల గ్రామాల నుండి సుమారు 20 భారీ ప్రభలు రావడం తో పల్లె తీర్ధానికి మధ్యాహ్నం నుండి నేటి రాత్రి వరకు సుమారు 50వేల మంది ప్రజలు సంక్రాంతి సందడిలో పలు దేవత ఉత్సవ మూర్తులను దర్శించుకొన్నారు.అక్కడ ఉన్న అందమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరో హైలైట్.. పంటలు సుభిక్షంగా పండి, పశు సంపదతో ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని దేవుళ్ళే కనుమ రోజు పంట పొలాలలోకి వచ్చే ఈ ప్రభల తీర్ధం తో కేరళకు మించిన అందాలు ఆనందాలు, ప్రభలు మోసే యువకుల ఉత్సహం చూడటానికి అదృష్టం ఉండాలి..
