సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో వందలయేళ్ళ సాంప్రదాయ సరదాగా సంక్రాంతి మూడు రోజులూ కోడి పందేలు, జూదం యథేచ్ఛగా జరిగాయి. పట్టణాలు గ్రామాల్లో సైతం కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలుగురాష్ట్రాలలో కోడిపందాలు, ఆతిధ్యాలకు రాజధానిగా పేరొందిన భీమవరం పరిసర ప్రాంతాలలో మొదటి రోజు కొంత మందకొడిగా ఉన్నపటికీ 2 మరియు 3వ రోజులు కోడి పందాలతో బరులలో కోడి పూజలు హోరాహోరి తలపడ్డాయి.ఎప్పటిలానే కోట్ల రూపాయలు చేతులు మారాయి. వెంప, పెదమిరం,సిసిలీ పరిసర ప్రాంతాలలో భారీ టెంట్లులు, ఫ్లడ్ లైట్స్ వెలుగులు తో పాటు ఈసారి ప్రో కబాడీ తీరున భారీ ఎల్ ఈడీ స్క్రీన్స్ ఫై కోడి పందాల లైవ్ ప్రదర్శనలు ఈసారి కోడి పందాలలో భీమవరం తనదయిన ఆధునిక పోకడలు కు దారి చూపించింది. బరుల వద్ద పేకాట, గుండాట యదేచ్చగా నిర్వహించారు. మద్యం ఏరులైపారింది. సంక్రాంతి పండుగకు కోడిపందేలు, జూదం నిర్వహించినా ఆడినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన అధికారులు అటు అధికార పక్షం, ఇటు ప్రతి పక్షం నేతలు పోటీ పడి సంప్రదాయం, డింకీ పందాల ముసుగులో బరులు ఏర్పాటు చేసి వాటికీ వారి పార్టీ రంగుల అలంకరణలు కూడా చేసెయ్యడం..చేసేది లేక ఈ 3 రోజులు కొన్ని నామమాత్రపు కేసులతో సరిపెట్టారు. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఇంత పెద్దఎత్తున పండుగ ముగియడం లో పోలీస్ వ్యవస్థ భద్రతా ఏర్పాట్లను అభినందించాలి. నేడు 4వ రోజు ముక్కనుమ పండుగ రోజు అతిధులు విందు వినోదాలు.క్రీడలు సాంస్కృతిక ప్రదర్శనలు, సినిమాలు, శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు, లూధరన్ హైస్కూల్ లో భారీ ఎగ్జిబిషన్ వినోదాలతో సంతృప్తి చెందుతున్నారు. కొందరు ఇప్పటికే తిరుగు ప్రయాణాలు చేపట్టడంతో రైల్వే, బస్సు స్టేషన్స్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *