సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చి మగోదావరి జిల్లాలో ఉప్పు లూరు గ్రామానికి చెందిన కొణతం నాగవెంకట సుబ్రహ్మణ్యం (42) అవివిహితుడు.. ఇతను తెలుగులో పీజీ, పీహెచ్డీ చేసి స్థానికంగా ట్యూషన్లు చెబుతూ జీవిస్తున్నారు. ప్రాధమిక తాజ సమాచారం ప్రకారం.. ఇతను ఉండి మండలంలోని విద్యార్థినిపై పెళ్లి చేసుకొంటానని వేధించి ఆమె నిరాకరించడంతో ఆ అమ్మాయిపై ఉన్మాదంతో కొడవలితో దాడికి పాల్బడటం, ఆ సమయంలో అడ్డువచ్చిన విద్యార్థిని తల్లికి కూడా తీవ్ర గాయాలు కావడం తీవ్ర సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. సుబ్రహ్మణ్యం మూడేళ్ల కిందట తన వద్దకు ట్యూషన్కు వచ్చి న పదో తరగతి విద్యార్థినితో చనువుగా ఉంటూ ప్రేమపేరిట వేధించేవాడు. దీనిపై ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో ఉండి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. తదుపరి ఆ యువతి మరో చోట ప్రైవేటు కళాశాలలో చేరింది. దీనితో కోపంతో ఉన్న సుబ్రహ్మ ణ్యం .. ఆమె సంక్రాంతి సెలవులకు స్వ గ్రామానికి రావడంతో గత మంగళవారం మధ్యాహ్నం, ఆ విద్యార్థినితో ఘర్షణ పడి ఆమె మెడ, చేతులపై కొడవలితో గాయపరిచాడు. ఈ క్రమంలోఅడ్డువెళ్లిన ఆమె తల్లిపైనా దాడి చేసి గాయపరిచాడు. దీనితో స్థానికులు నిందితుడిని పట్టుకొని చిత్తుగా కొట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన తల్లికుమార్తెలను, 108 వాహనం లో భీమవరం లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అనంతరం వారు కోలుకొంటున్నారు. పోలీసులు గాయపడిన నిందితుడు సుబ్రహ్మణ్యం ను ( ఫై ఫొటోలో )భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *