సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వారి కుటుంబ విభేదాలు, ఆస్తుల గొడవలు ఏమిటో కానీ.. గతంలో అన్న వై ఎస్ జగన్ వదిలిన బాణంగా చెప్పుకొన్న షర్మిల.. ఇప్పుడు ఎన్నికలలో పోటీ కూడా చేయలేని తన తెలంగాణ వైసిపి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన బాణంగా తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మి ల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారథి అయ్యారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ ను తొక్కాలని ఏపీని విభజించి వై ఎస్ కుటుంబసభ్యుల సంఘటిత ప్రభంజన దాటికి కాంగ్రెస్ విభజిత ఏపీలో సర్వనాశం అయ్యిందో.. అదే వై ఎస్ కుటుంబము లోని షర్మిల ద్వారా మరల ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రాభవం పొందాలని అడుగులు వేస్తుంది. ఇప్పటికే సీఎం జగన్ ఏపీలో టీడీపీ జనసేన , బీజేపీ లెఫ్ట్ పార్టీలను ఒంటరిగా ఎదురుకొంటున్నారు. ఇప్పడు కాంగ్రెస్ తరపున షర్మిలమ్మ కూడా ప్రతిపక్షాలకు తోడు కానున్నారు. మొన్నటి వరకు తన తండ్రి ys మరణానికి కాంగ్రెస్ పెద్దలే కారణమని ఆరోపించి.. మరోసారి తెలంగాణ కోసం పోరాడతానని చెప్పి ఇప్పుడు అదే కాంగ్రెస్ కోసం ఏపీలో అడుగుపెడుతున్న షర్మిల తీరును ఎందరు హర్షిస్తారో ? తెలియదు.కానీ ఈసారి తన తొలిఅడుగు గా తమ కుటుంబానికి పట్టున్న కడప జిల్లాని తన బలప్రదర్శనకు తొలి వేదికగా మార్చుకోబోతున్నారు.పీసీసీ సారథిగా బాధ్య తలు స్వీకరించే ముందు వైఎస్ షర్మిల తొలుత ఇడుపులపాయలోని తండ్రి వైఎస్సా ర్ సమాధిని దర్శించుకుని, ఆయనకు నివాళి అర్పించి తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. .
