సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు, శనివారం మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి సంకల్పంతో ఉన్నామని ఇక్కడ పార్టీలో గెలిచే అభ్యర్థికే సీటు ఇస్తామని అంతేకాని పార్టీలు మారి వచ్చేవారికి టీడీపీ పార్టీలో అయారాం గయారాం లను పట్టించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. (ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ కొత్తగా టీడీపీ లోకి వచ్చినవారికి గతంలో పార్టీని విడిచి బయటకు వెళ్లి మరల వచ్చిన వారికీ కొంత ఇబ్బంది పెట్టె విషయమే..) అమలాపురంలో 7 సీట్లను తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని పూర్తి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. మండపేటలో మరోసారి జోగేశ్వరరావును ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ మాత్రమే అని అన్నారు.
