సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 500 ఏళ్ళ తరువాత అయోధ్య ఆలయంలో కొలువై ఉన్న బాల శ్రీరామచంద్రుని దర్శించుకోవాలనే భక్తులకు శుభవార్త! రేపటి మంగళవారం నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం లభిస్తుంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు మరియు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శించుకోవచ్చు.. భక్తులు దర్శనాల కోసం ముందస్తుగా ఆన్ లైన్ లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి వివరాలు తెలిపి స్వామీ వారి దర్శనం టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలు త్వరలోనే అందుబాటు లోకి తీసుకు రానున్నారు. శ్రీ స్వామి వారి హారతి వేళలు :ఆలయంలో రోజు వారీ ఉదయం 6 గంటలకు జాగరన్/శృంగార్ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి లను నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *