సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం త్యాగరాజ భవసంలో నేడు, మంగళవారం మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాలలో దశాబ్దాలుగా ఖ్యాతి గాంచిన డా॥ ఉమర్ ఆలీషా సాహితీ వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాధిపతి (పిఠాపురం) డా॥ ఉమర్ ఆలీషా అధ్యక్షతన భీమవరంలో 31వ వార్షికోత్సవ సభ విశేషంగా వచ్చిన ఆహుతుల మధ్య నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ నవల రచయిత జొన్నవిత్తుల రామచంద్రమూర్తి సాహితీ ప్రసంగం చేసారు. ఈ సాహితీ సమితి ఎంతో మంది సాహితీ వేత్తల, ప్రముఖుల ప్రసంగాలను భీమవరంలో సాహితీ ప్రియులకు ఆధ్యాత్మిక వాదులకుఅందింపచేస్తూ, వివిధ రంగాలలో విశిష్టులైన వారికి పురస్కారాలను ప్రదానం చేస్తూ రావడం అభినందనీయం అన్నారు. ఈసభలో ఈ ఏడాది డా॥ ఉమర్ ఆలీషా సాహితీ పురస్కారం ను హైదరాబాద్ కు చెందిన డాక్టర్ వాసలి వసంత కుమార్ కి అందజేశారు. దానితో పాటు 50, 116 బహుమతి ని అందజేశారు. ఈ కార్యక్రమానికి సాహితీ సమితి కార్యదర్శి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ దాయన సురేష్ చంద్రజీ నేతృత్వం వహించగా , ఉపాధ్యక్షులు తస్రవటపల్లి మురళీకృష్ణ, కోశాధికారి వడ్డాది వెంకటేశ్వర శర్మ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *