సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో.. దివంగత బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు అత్యంత ప్రతిష్టాకర గౌరవం దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. 1924 జనవరి 24న బీహార్ లోని సమస్తీపూర్ జిల్లాలో ఆయన జన్మించారు. 1988 ఫిబ్రవరి 17న కన్ను మూశారు. జననేత ‘జననాయక్’గా ప్రసిద్ధిగాంచిన కర్పూ రి ఠాకూర్డి గతంలో డిసెంబర్ 1970 నుంచి ఏప్రిల్ 1979 వరకు రెండు సార్లు బిహార్ సీఎంగా విశిష్ట సేవలు అందించారు.
