సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏడాదిన్నర క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ప్రెవేటు పరం చెయ్యవద్దని కోరుతూ చేసిన రాజీనామాకు నేడు (మంగళవారం) అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలిపారు. అతి త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల లో ఏపీకి కేటాయించిన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల ను గెలుచుకోవడానికి తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉన్న అధికార వైసిపి ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటుంది. టీడీపీ కి ఎట్టి పరిస్థితులలో అవకాశం ఇవ్వడకూడని భావిస్తుంది. అలాగే గత కొంతకాలం క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నపుడు వైసీపీ కి ఝలక్ ఇచ్చి ఒక టీడీపీ అభ్యర్థి కి క్రాస్ ఓటింగ్ చేసిన ఇటీవల పార్టీ మారుతున్నా వారిపై కూడా ముందస్తు చర్యలకు వైసిపి సిద్ధం అవుతుంది.ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పైనా వేటు పడే అవకాశం ఉంది. వారికి ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. వైసీపీ వ్యూహానికి టీడీపీ కౌంటర్ గా . టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై కూడా టీడీపీ తమ అనర్హత పిటిషన్ వేసింది. దానితోవైసీపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా నేడు, మంగళవారం అసెంబ్లీ అధికారులు నోటీసులిచ్చారు.గతంలో ఈ ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులకు సమాధానం ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *