సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే పోలీస్ అధికారుల బదిలీలు ముమ్మరం గా జరిగాయి. ఇప్పుడు రేపు ఎల్లుండి లోగ మరిన్ని కీలక శాఖలలో ఉద్యొగులు బదిలీ కానున్నట్లు సమాచారం. ఎన్నికల ఓటర్లు ఫైనల్ జాబితా కూడా విడుదలయింది. ఇక ఎన్నికల నిర్వహణకు వీలుగా అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్‌ జిల్లాలో ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇక తదుపరి చర్యల్లో భాగంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీస్ లో ఉన్న అధికారులను తక్షణం వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని ఆదేశాలు అందాయి. ఈనెల 25లోపే ఈ బదిలీల పర్వము పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎవరెవరు, ఎక్కడెక్కడ అనే దానిపై జిల్లా యంత్రాంగం ఒక స్పష్టతతో ఉన్నందున నేడో, రేపో కీలక ఉత్తర్వులు రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *