సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రోడ్ అలైన్‌మెంట్ లో అక్రమాలు జరిగాయని ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏపీ హై కోర్ట్ ఇచ్చిన బెయిల్‌ను రద్దు చెయ్యాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఐఆర్ఆర్ కేసులో ఈ నెల 10న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నెల 29న ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *