సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి టీడీపీ కార్యాలయంలో నేడు, బుధవారం మాజీ మంత్రి పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాజమండ్రి ఎమెల్య గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. అతి త్వరలో ఏపీలో 3 సీట్లకు ఎమ్మెల్యేల కోటా నుండి జరగనున్న రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు అధికార వైసిపి ఎమ్మెల్యే లు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు, సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది వైసిపి ఎమ్మెల్యే లు సంప్రదిస్తున్నారని చెప్పా రు. ‘‘సీఎం జగన్ కు రాజ్యసభ ఎన్నికలలో ఒక సీటు కోల్పోతామని ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎప్పుడొ గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదిం పజేశారు. అం బేడ్కర్ విగ్రహం పేరుతో వైసిపి నేతలు దోపిడీ చేశారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుంది? కేసుల నుంచి తప్పించుకోవడం జగన్ కు అలవాటైపోయింది’’ అని విమర్శించారు.
