సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ సినీ నటుడు , గతంలో వైసీపీ పార్టీలో పనిచేసి ఎస్వీబిసి ఛానెల్ చైర్మెన్ వంటి కీలక పదవిలో పనిచేసిన పృధ్వీ రాజ్ తదుపరి పరిణామాల నేపథ్యంలో ఆ పదవికి ఆ పార్టీకి రాజీనామా చేసి చాలాకాలంగా టీడీపీ జనసేన పార్టీలకు మద్దతుదారుడుగా నిలబడటం అందరికి తెలిసిందే.. అయితే నేడు బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో అధికారికముగా పార్టీలో చేరారు. ఆయనకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పనిచేసే జానీ కూడా జనసేన లో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో నేడు,బుధవారం గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ అయ్యారు. గూడూరు వైసీపీ టికెట్‌ను మేరుగ మురళికి కేటాయించిన సంగతి తెలిసిందే. దాంతో పార్టీలో చేరే అంశంపై చర్చిస్తున్నారు. తిరుపతి నుంచి లోక్ సభకు పోటీ చేయాలని వరప్రసాద్ భావిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *