సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఇటీవల పట్టణ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో వార్డు వార్డు కు ‘రాష్ట్రానికి మళ్లీ వైయస్ జగన్ ఎందుకు CM కావాలి; అనే కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే.. దీనిలో భాగంగా నేడు, బుధవారం స్థానిక 32 వ వార్డులో ఈ రాష్ట్రానికి మళ్లీ జగన్ CM కావాలి అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అడ్జక్షుడు తోట బోగయ్య, 2వ పట్టణ వైసీపీ పార్టీ ఇంచార్జి గాదిరాజు సుబ్రమణ్య రాజు ( తాతారాజు) శ్రీమతి గూడూరి ఉమాబాల, , కోడె యుగంధర్, ఏఎస్ రాజు గంటా సుందర్ కుమార్, తదితర నేతలు పాల్గొని సీఎం జగన్ అందిస్తున్న ప్రజా సంక్షేమ పధకాలు అమలు , స్థానిక 32 వార్డులో గత 4 న్నర ఏళ్లుగా జరిగిన ప్రభుత్వ అభివృద్ధి పనులు నిర్మాణాలు వివరించారు.
