సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్ర లోని నాసిక్ లో జరిగిన జాతీయ యువజనోత్సవాలకు వీఐటీ నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు డా.బి.వి.రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రకటించింది. ప్రతి సంవత్సరం జనవరి 12-16 తేదీల్లో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS) మరియు జాతీయ సేవా పథకం (NSS) సంయుక్తంగా జాతీయ యువజనోత్సవాలు నిర్వహిస్తారని, ఈ ఏడాది దీనిలో పాల్గొనుటకు ఆంధ్రప్రదేశ్ నుంచి జేఎన్టీయూకే పరిధిలో కేవలం ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేసిందని ఆ ఆరుగురిలో ముగ్గురు విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వారు కావడం గర్వకారణం అన్నారు. యువజనోత్సవాలలో, దేశవ్యాప్తంగా 7500 మంది యువ ప్రతినిధులు. కళాకారులు పాల్గొని వారి ప్రతిభ .. సామాజిక ఐక్యత కోసం, కృషి చేసారని అన్నారు. ఈ నేపథ్యంలో విష్ణు విద్యార్థులను, NSS సమన్వయకర్త డా. గంగరాజు ని డైరెక్టర్ డా. దశిక సూర్యనారాయణ, ప్రిన్సిపాల్ డా. మంగం వేణు , వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి అధ్యాపకులు అభినందించారు.
