సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి లో గత రాత్రి జరిగిన ఇండియా టుడే విద్యా సదస్సు లో సీఎం వైఎస్ జగన్ ను దేశ జర్నలిజంలో , రాజకీయనేతల ఇంటర్యూలలో కొత్తవరవడి సృష్టించిన రాజ్ దీప్ ఇంటర్యూ చేసారు. జగన్ సీఎం అయ్యాక తొలిసారి మీడియా ఛానెల్ కు ప్రత్యక ఇంటర్యూ ఇచ్చింది తనకే అంటూ రాజ్ దీప్ పలు ప్రశ్నలు సూటిగా సంధించగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సచివాలయ వ్యవస్థతో,వలంటీర్ వ్యవస్థతో ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు రాష్ట్రంలో తొలిసారి సంక్షేమ పథకాలలో లబ్దిదారులకు అవినీతికి తావులేకుండా డీబీటీ ద్వా రా రూ.2.53 లక్షల కోట్లు డైరెక్ట్ గా వారి ఆకౌంట్స్ కే అందించామన్నారు. డబ్బుతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి చదువుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పోటీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఉచిత ఇంగ్లిష్ మీడియం చదువు, వసతి, పౌష్ఠిక ఆహారం , డబ్బు అన్ని అందిస్తున్నాము అన్నారు. కార్పొరేట్ స్కూల్ లకు పోటీగా ప్రభుత్వ స్కూళ్ల ను తీర్చిదిద్దటమే కాదు టెక్నాలజీ అనుసంధానం చేసి విద్య అందిస్తున్నాము అన్నారు. తమ మేనిఫెస్టోలో 99 శాతం హామీల అమలుచేశామన్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయ్ కాబట్టే అవినీతి కి పాల్బడిన చం ద్రబాబు ను కోర్టు జైలుకు పంపింది అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానంగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిం చిన కాంగ్రెస్ మళ్లీ నీచ రాజకీయాలు చేస్తోంది. నాన్న వై ఎస్ మరణం తరువాత నేను కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలబడినప్పుడు నా సొంత బాబాయిని మంత్రిగా చేశారు. తర్వాత మా పార్టీ అభ్యర్థిపైనే పోటీకి నిలబెట్టారు. ఇప్పుడు కూడా అదే చేశారు. నా కుటుంబాన్ని విడగొట్టారు. మా చెల్లిని తీసుకొచ్చి , ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిని చేశారు. కానీ, వారొక విషయాన్ని మర్చిపోతున్నా రు. పైన దేవుడనే వాడున్నాడు. ఎవరికి ఎప్పు డు, ఎలా గుణపాఠం చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. నాకు ఆనమ్మకం ఉంది. ఆఖరికి వైఎస్సా ర్ కుటుంబంపై విభజించు–పాలించు ప్రయోగం కాంగ్రెస్ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదు అని సీఎం జగన్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *