సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద గత శనివారం ‘సిద్ధం ’ పేరుతో ఏర్పా టు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశానికి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ అక్కడ నిజంగానే శంఖం ఉది శంఖారావం పూరించారు. విజయడంకా నాదం అంటూ నిజమైన భారీ డంకా ను మ్రోగించారు. భీమిలి సముద్ర తీరానికి సమీపంలో మరో జనసముద్రం తలపించే భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రజలను వైసిపి అభిమానుద్దేశించి మాట్లాడుతూ.. అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడనని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొత్తులు, జిత్తుల పద్మ వ్యూ హాలతో చంద్రబాబు నేతృత్వంలోని కౌరవ సైన్యా న్ని, ప్రక్క రాష్ట్రము నుండి వచ్చిన దొంగల ముఠా ను ఎదుర్కొ నేందుకు ప్రజల ఆశీస్సు లు, దేవుడి దయ వంటి కృష్ణుడి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించారు. ప్రజలకు ఏమి చెయ్యని చంద్రబాబు సిగ్గులేకుండా ఓట్లు అడుగుతుంటే.. ప్రజలకు ఇచ్చిన 90 శాతం హామీలు నెరవేర్చిన , ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన మన వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చా రు. ప్రజలలో పాతుకొని పోయిన వైసీపీ కి ఎదురొడ్డి ఒంటిరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడు తున్నాడంటే దాని అర్థంఏమిటో? ఆలోచించండి. నాకు పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ సగం పదవులన్నీ ఈ వర్గాలకే ఇచ్చాం అన్నారు సీఎం జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *