సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ , పి ప్రశాంతి నేటి ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. వారికీ ఆలయ మర్యాదలతో, పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద ఆశీర్వచనం తో పూజలు నిర్వహించినారు ఈ కార్యక్రమం లో ఆర్డీఓ, ఎంఆర్ ఓ తదితర అధికారులు పాల్గొన్నారు. వీరికి ఆలయ సహాయ కమిషనర్ మరియు దేవాలయ కార్యనిర్వహణిధికారి యర్రంశెట్టి భద్రాజీ ప్రసాదాలు శేషవస్త్రం అందచేసినారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, మానేపల్లి నాగేశ్వరరావు మరియు ధర్మకర్తలు ముత్యాల వెంకట రామారావు , రామాయణం సత్యనారాయణ,ch శేషగిరి,మావూరి సుందర రావు పాల్గొన్నారు, నేటి ఆదివారం ఉదయం నుండి దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తులు విశేషంగా శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు.ఆకివీడు కు చెందిన పూల పండ్ల వ్యాపారి షేక్ సుభాని శ్రీ అమ్మవారికి భారీ గజమాలను సమర్పించారు, సాయంత్రం నుండి భక్తులు క్యూ లైన్ లు కిలో మీటర్ మేర పెరిగిపోయింది. ఆలయ ఆవరణలో వేసిన లైటింగ్ సెట్టింగ్ లలో వేలాదిగా ఆబాల గోపాలం సందడి చేసారు. నేటి సాయంత్రం కూచిపూడి జానపద నృత్యం తో పాటు రాత్రి 8గంటలకు ప్రారంభమైన బాలనాగమ్మ నాటకం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది.
