సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఏడాదిన్నరగా భీమవరం పట్టణంలో అన్ని వార్డులలో కొత్త రోడ్డులు వేశారు. బై పాస్ లో కొత్త రోడ్డు వేశారు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలోకి వచ్చే అన్ని ప్రధాన రహదారులుకు కొత్త రోడ్డులు పడుతున్నాయి కానీ.. ప్రతి రోజు వాహనదారులు వేలాదిగా పయనించే స్థానిక విజయలక్ష్మి థియేటర్స్ నుండి టీపీ గూడెం వైపు వెళ్లే రోడ్డు వాహనదారులను భారీ గుంతలతో ముచ్చెమటలు పట్టిస్తూ వేధిస్తూనే ఉంది. ఎందరో గాయాలు పాలు అయ్యారు. అయితే అటుగా ప్రయాణించే ప్రయాణికులకు, వేలాది విద్యార్థులకు ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి. తాజగా భీమవరం రైల్వే అండర్ రైల్వే టర్నల్ నుండి (తాడేపల్లి గూడెం వైపు వెళ్లే రోడ్) విష్ణు కాలేజీల దాటే వరకు 2-7 కిమీ ( సుమారు 3 కిమీ రోడ్డు) నూతన తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నేటి బుధవారం, ఉదయం ఈ రోడ్డు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న డివిజన్ ఇంజనీర్ రామరాజు మన సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ .. 3 కోట్ల నిధులతో ఈ నూతన రోడ్డు పనులు చెప్పటామని మరో 2వారాల లోపే 2-7 కిమీ మేర నూతన రోడ్డులు నిర్మించడం పూర్తీ అవుతుందని శరవేగంగా నాణ్యత తో కూడిన పనులు జరుగుతున్నాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *