సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క ఏపీలో అధికార పక్షం వైసిపి వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ, అటు లోక్ సభకు ఇప్పటికే 6 లిస్టులు విడుదల చేసింది.కొన్ని చోట్ల లిస్ట్ లోని అభ్యర్థుల చేర్పులు మార్పులు కూడా జరిగిపోతున్నాయి. టికెట్స్ రాని కొందరు సిట్టింగ్ ప్రజాప్రతినిధులు అటు టీడీపీ , లేదా జనసేన లొకి దూకేయ్యడానికి సిద్ధం అయిపోతున్నారు. ఇది చూసి టీడీపీ జనసేన నేతలు ఆనంద పడుతున్నారు తప్ప.. ఇదే విషయాన్ని వైసిపి అధిష్టానం సీరియస్ గా తీసుకోవడం లేదు.. ఏది ఏమైనా కష్టమో నష్టమో ? ఎన్నికలకు 2 నెలలు ముందే వైసిపి అభ్యర్థులు అందరు బరిలో ఉంటున్నారు. మరి… తమ కూటమిలోకి బీజేపీ వస్తే కానీ తమ లిస్ట్ చెప్పలేమని కాలయాపన చేస్తున్న టీడీపీ జనసేన అధినేతలు హైదరాబాద్ లోనే కూర్చుని అభ్యర్థులను నిర్ణయించే ప్రణాళిక రచిస్తున్నారు. లీకుల ద్వారా కొత్తగా వైసిపి నుండి వచ్చే వారికీ టికెట్స్ ఇచ్చే కంటే కష్ట కాలంలో పార్టీని రక్షించిన నేతలకు టికెట్స్ ఇస్తే మంచిదని వారి క్యాడర్ ల ఆలోచన.. అసలు నిజానికి పొత్తు పొత్తు లోకి రాను రాను అంటున్న బీజేపీ ని ఒక కారణంగా చూపుతున్నారే తప్ప.. అసలు కారణం విశ్లేషిస్తే.. టీడీపీ-జనసేన కూటమిలో పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు? అధికారికంగా కేటాయించాలంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కు పెద్ద ఇబ్బందికర అంశంగా మారింది. తాము ఆశిం చిన మేరకు సీట్లు, నియోజకవర్గాలు దక్క కపోతే అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలలో ఉద్రికతలు చోటు చేసుకొంటాయి. అంతేకాదు జనసేన క్యాడర్ ఆశిస్తున్నా 50 సీట్లకు సగం 25మాత్రమే టీడీపీ కేటాయిస్తుంది? అన్ని బయట జోరుగా జరుగుతున్నా ప్రచారం నిజమైతే మాత్రం.. జనసేన క్రింది క్యాడర్ నుండి టీడీపీ కి కూడా అదే శాతం ఓట్ల మద్దతు మాత్రమే లభిస్తుందని అనధికార ప్రకటనలు వస్తున్నాయి. ఎన్నికల ప్రారంభంలో నివురుగప్పిన నిప్పు రగులుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆలస్యం అమృతం విషం .. అన్నట్లు ఇప్పటికైనా టీడీపీ జనసేన తమ అభ్యర్థుల లిస్ట్ బయట పెట్టి వారిని ఎన్నికల బరిలో దింపక పొతే ఉన్న కొద్దీ సమయం అసంతృప్తులను బుజ్జగించడానికి సరిపోతుంది. ఇక ప్రజాక్షేత్రంలో ప్రచారానికి సమయం ఎక్కడ ఉంటుంది?..నాన్చడమే మా రాజకీయ ప్యూహం అనుకుంటే మాత్రం,.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *