సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుత కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీని 2న్నర దశాబ్దాల క్రితం తన అయోధ్య’రధ యాత్ర తో దేశవ్యాప్తంగా విజయబాటలు వేసి ప్రస్తుతం తన వయో భారంతో రాజకీయాలలో విశ్రాంతి తీసుకొన్న మాజీ ఉప ప్రధాని, మహా నేత అద్వానీ కి భారత ప్రభుత్వం అత్యు న్న త పౌర పురస్కారం‘భారతరత్న ’తో గౌరవించింది. ఈ క్రమం లో ప్రధాని నరేం ద్ర మోదీ ట్వి ట్టర్ వేదికగా .. ఎల్కే అద్వానీ జీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. ఎల్కే అ‍ద్వానీ రాజనీతిజ్ఞుడు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకుఎదిగారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు. పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన పార్లమెం టరీ సూచనలు ఎప్పుడూ ఆదర్శప్రాయమైనవి, అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *