సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేష్ బాబు, భీమవరం బ్రాండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా తరువాత హ్యాట్రిక్ మూవీగా రూపుదిద్దుకున్న చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. మొదటి రోజు తీవ్ర నెగిటివ్ ప్రచారానికి గురైనప్పటికీ.. రెండో రోజు నుండి అనూహ్యంగా పుంజుకుని.. 250 కోట్ల వరకు అద్భుతమైన కలెక్షన్స్‌ను రాబట్టింది. రమణగాడుగా మహేష్ బాబు మాస్ నటనకు జనాలు నీరాజనాలు పలికారు. మాస్ డ్యాన్స్‌తో కూడా మహేష్ బాబు అందరిని మెప్పించారు.ఇంకా కలెక్షన్స్ పరంపర కొనసాగుతుండగానే..నెలరోజులు తిరగకుండానే .. ‘గుంటూరు కారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ కాబోతుందని తెలుపుతూ.. సదరు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *