సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక వ్యక్తి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా , కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొవ్వూరు పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు తెలిపారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన యడ్లపల్లి శ్రీనివాసు (45) అలియాస్ టిక్‌టాక్ శ్రీనుగా అందరికి సుపరిచితుడు. సినిమాలలో కూడా చూపించని అష్టకష్టాలు పడ్డాడు. మృతుడు శ్రీనివాస్ సగ్గొండ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అయితే టిక్‌టాక్ చేస్తూ ..జీవితం సాఫీగా సాగిపోతుండగా 8 సంవత్సరాల కిందట అతని ఇద్దరు పిల్లలు పాముకాటుకు గురై రోజు విడిచి రోజు తేడాలో మృతిచెందారు. అనంతరం భార్య భర్తలిద్దరూ ఒక బాలికను దత్తత తీసుకున్నారు. అతను కష్టాలు నుండి తేరుకుంటుండగా భార్య, తండ్రి ఏడాది కిందట చనిపోయారు.అప్పటి నుంచి తీవ్ర మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు.ప్రస్తుతం తల్లి,దత్తత కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ గత శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కొవ్వూరు రోడ్ కం రైలు బ్రిడ్జిపై బైక్ పార్క్ చేసి నదిలో దూకేశాడు. కొవ్వూరు ఇసుక ర్యాంపు పడవ కార్మికులు గమనించి శ్రీనివాస్‌ను నది నుంచి ఎరినమ్మఘాట్ ఇసుక ర్యాంపుకు తీసుకువచ్చారు. అప్పటికే మృతిచెందడంతో పోలీసులకు సమాచారం అందించారు.
