సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 60 వ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకొంటున్న భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి నేడు, సోమవారం విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు చెన్నా జనార్ధనరావు, k వెంకటరాజు మరియు ఆలయ సిబ్బంది అర్చకులు సారే అందించారు. వారు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి సంప్రదాయ బద్దంగా అమ్మవారికి , పసుపు కుంకుమ, గాజులు చీర, రవిక, మిఠాయి, పండ్లు, పూలు తో సారే అందించారు. ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారికి సారేని అందించారు. అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థాన సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. కార్యక్రమంలో మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ మానేపల్లి నాగన్న బాబు, పాలకవర్గ సభ్యులు రామాయణం సత్యనారాయణ, ముత్యాల రామారావు,భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *