సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడు టీడీపీ జనసేన పొత్తులలో ఖరారు అయిన అభ్యర్థుల లిస్ట్ విడుదల అవుతుందా? అధికార వైసిపి అభ్యర్దులకు దీటుగా ఎన్నికల బరిలోకి దూకేద్దాం అని చూస్తున్న క్యాడర్ ఆశలపై ఒకింత నీళ్లు జల్లుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు, మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బాబు ఢిల్లీ వెళుతున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశం అవుతారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ నుండి బీజేపీ కేంద్ర పెద్దల నుండి పిలుపు వచ్చిందో లేదా? బీజేపీ ని తమ కూటమి లోకి ఆఖరి సారిగా ఆహ్వానించడానికి చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారో? తెలియదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వేదికగా ఏం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటన వస్తుందో.. కొత్తగా ఏమి త్యాగాలు చెయ్యాలో అని టీడీపీ, జనసేన శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అయితే జనసేన కు చాల తక్కువ సీట్లు ( ప్రచారం జరుగుతున్నట్లు 23 సీట్లు మాత్రమే?) కేటాయిస్తున్నందునే వారి ద్రుష్టి ఎన్నికల ముగింట వరకు మరలచడానికే..రాజకీయ చాణిక్యుడు చంద్రబాబు ప్యూహాత్మకంగా ఏపీలో పెద్దగా ప్రభావం చూపని బీజేపీ మద్దతు కోసం మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జనసేన అధినేత పవన్ కూడా పొత్తులో మనకు ఎన్ని సీట్లు వచ్చాయని కాదు వాటిలో 98 శాతం గెలవాలని అంటున్నారంటే.. నిజంగా బీజేపీ కూడా కూటమిలోకి వస్తే జనసేన కు సీట్లు ? ఇంకా త్యాగాలకు సిద్ధం కావాలో ? ఎన్నో ప్రశ్నలు..
