సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెలూరు జిల్లా కావలిలో నేడు, శనివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో టోల్‌ప్లాజా వద్ద రెండు లారీలు, ప్రైవేట్ బస్సు ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.. గాయపడిన బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన బాధితులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇంకా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. పూర్తీ సమాచారం అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *