సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో నరసాపురం నుండి జనసేన తరపున ఎంపీ స్థానానికి పోటీ చేసి 3వ స్థానంలో నిలచిన.. ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు భావిస్తున్న మెగా సోదరుడు నాగబాబు అనకాపల్లి లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా, నేడు, శనివారం అనకాపల్లి లో పర్యటించిన నాగబాబు మాట్లాడుతూ.. . స్థానిక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. గంజాయి అక్రమ రవాణాలో స్థానిక మంత్రికి ప్రమేయం ఉందని, ఆ మంత్రి పేరు పలికితే తన నోరే పాడైపోతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికిన ఏజెన్సీ ప్రాంతాన్నే చూపిస్తున్నారని, ఇది చాలా బాధాకరం అన్నారు. వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలతో పాటు, అందరికీ ఉచిత విద్య వైద్యం అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు. జనసేన, టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. జనసేన నేతలు పొత్తులో మనకు ఎన్ని సీట్లు అని ఒత్తిడి తేవద్దని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ చూసుకుంటారని చెప్పారు.సీఎం జగన్ ఒక సైకో అని, అద్భుత నటుడు..ఆయన రేంజ్ లో మేము నటించలేము, అంటూ నాగబాబు , జగన్ తన ఓట్ల కోసం మనుషులను 2వర్గాలుగా, కులాల వారీగా విడదీస్తున్నారని, వైసీపీ నాయకులు ఓటర్లను ప్రాణం ఉన్న మనుషులుగా గుర్తించాలని విమర్శించారు.
