సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసియున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు హిందూధర్మ ప్రచార మహోత్సవములు సందర్భముగా ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు నేడు, ఆదివారం విద్యార్థీని, విద్యార్దుల చే పూజా కార్యక్రము మరియు హరే శ్రీనివాస భజన మండలి, గునుపూడి భీమవరం వారిచే కోలాట ప్రదర్శన కార్యక్రము నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తలు కూర్మదాసు సత్యశ్రీనివాస్, నాచు శ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, చెల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ పాల్గొన్నారని ఇఓ రామకృష్ణంరాజు తెలిపారు.
