సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేడు, ఆదివారం ఏపీ విభజన జరిగి నేటికి (ఆదివారం) పదేళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రములో కాంగ్రెస్ అధికారం లో ఉండగా ఏపీ రాష్ట్ర విభజన రాజ్యాంగ పరిధిలో జరగలేదని లోక్ సభ వాళ్లు విడుదల చేసిన పుస్తకం ఆధారంగా కోర్టులో పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. ఆయన ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఫై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీలో అన్ని తానే అయ్యి సీఎం జగన్ మొండిగా ముందుకు వెళుతున్నారని 2014 ఎన్నికలలో 2019 ఎన్నికలలో కూడా ఇదే తీరున వ్యవహరించి తనకు నచ్చినవారికి టికెట్స్ ఇచ్చి మంచి ఫలితాలు సాధించారని ఇక్కడ వైసీపీలో ఎమ్మెల్యే లకు ప్రత్యేకలు ఏమి ఉండవని అన్ని జగన్ చూసుకొంటారని , అవసరం అయితే వాలంటీర్లు ను నిలబెట్టేసాడు అని .. ఈసారి కూడా చాల మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్స్ ఇవ్వకుండా కొత్త వారికీ ఇస్తున్నారని , ఇది చాల రిస్క్ తో కూడినదని, పోయే ఎమ్మెల్యే కు కొంత ఓట్లు బలం ఉంటుందని ఒకవేళ వాళ్ళు పోయిన రేటింపు ఓట్లు వస్తే జగన్ ఆలోచన బాగున్నట్లని లేకపోతె ఇబ్బంది తప్పదని అన్నారు. అలాగే దేశంలో ఎందరో నేతలు ఇందిరా గాంధీ, చరణ్ సింగ్, లాలూ ప్రసాద్, జయలలిత , జగన్ వంటి వారు జైలు కు వెళ్ళాక పీఎం లు సీఎంలు అయ్యారని ఆ లెక్కన చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే సెంటిమెంట్ ప్రకారం సీఎం కావచ్చు.. అని ఛలోక్తి విసిరారు ఉండవలి..
