సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి , ఏలూరు జిల్లా నడుమ ఉండే ప్రాచీన మంచినీటి సరస్సు కొల్లేరు అభయారణ్యం ఐదో కాంటూరు పరిధిలో ఎక్కడా అక్రమ చేపల చెరువులు తవ్వకుండా ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్టు వన్యప్రాణాల విభాగం డివిజనల్ అటవీశాఖ అధికారిణి ఎం.హిమశైలజ ప్రకటించారు. ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడు, మల్లవరం, బొబ్బిలిలంకలో ఆమె పర్యటించి అక్రమ చేపల చెరువులను పరిశీలించారు. అభయారణ్యం పరిరక్షణకు రాజమండ్రి సర్కిల్ పరిధిలోని అటవీశాఖ అధికారులను, సిబ్బం దిని ఏలూరు వన్యప్రాణి విభాగం కార్యాలయంలో సమావేశ పరిచి అభయా రణ్యం పరిరక్షణకు సూచనలు ఇచ్చామన్నారు. . 52 మంది అటవీశాఖ అధికా రులు, సిబ్బందితో కలిసి కొల్లేరు అభయారణ్యంలో ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వకాలు జరగకుండా తనిఖీలు చేశామన్నారు. టాస్క్ఫోర్స్ టీమ్ వారు నిరంతరం ఇక్కడ గస్తీ తిరుగుతూ అక్కడ చెరువులు త్రవ్విన వారిపై వన్యప్రాణుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
