సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో పీఎం కిసాన్ – డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా 16వ విడత సాయం త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈనెల 22 లోపు రైతులంతా ఈ-కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రకటించింది. అంటే మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతలుగా రూ 2 వేల చొప్పున రూ 6వేల సాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ 7,500 కలిపి మొత్తం రూ 13,500 అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గడిచిన నాలుగున్న ఏళ్ళుగా 15 విడతలుగా సాయం అందించగా 16వ విడత సాయాన్ని త్వరలోనే అందించనున్నారు. నిర్దేశిత నిబంధనల మేరకు ఈక్రాప్ తో పాటు- ఈ కేవైసీ పూర్తి చేసుకన్న రైతులకే పథకం వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ క్రాప్, ఈ-కేవైసీ పట్ల రైతులకు వ్యవసాయశాఖ అవగాహన కల్పిస్తోంది.ఈనెల 22 లోపు ప్రతి రైతు ఈ క్రాప్, ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
