సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం కుప్పంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. ఆవిడ స్థానిక టీడీపీ నేతలతోఏర్పాటు చేసిన సభలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. భువనేశ్వరి మాట్లాడుతూ.. ” ఈరోజు కుప్పంకు వచ్చాను.. ఇక్కడ నాకొక కోరిక ఉంది నా మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది, నేనేమి అనుకోను ..నిజం చెప్పండి.. యిసారి నా భర్త చంద్రబాబు బదులు నేను ఇక్కడి నుండి పోటీ చేద్దామనుకొన్నాను .. నన్ను గెలిపిస్తారా ? నిజం చెప్పండి.. .. 35ఏళ్లుగా చంద్రబాబును కుప్పం ఎమ్మె ల్యే గా ఉన్నారు.. ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెబుతున్నాఅనగానే అక్కడి నేతలు అవాక్కయ్యారు. దీనితో వెంటనే ఆమె తేరుకొని ఎదో సరదాగా జోక్ చేశాను. నాకున్న బిజినెస్ తోనే సరిపోతుంది. రాజకీయాలకు నేను దూరం అంటూ నవ్వేశారు. అయితే ఆమె మాటలు చంద్రబాబు కుప్పం సీటు బదులు మరో సీటు నుండి పోటీ చెయ్యబోతున్నారు అని ప్రచారం లో ఉన్న వార్తలకు పట్టు చేకూరింది. వాస్తవంగా వివరాలలోకి వెళ్ళితే..ఈసారి ఎట్టి పరిస్థితులలో కుప్పం నుండి చంద్రబాబు ని గెలవనివ్వకూడదని అధికార వైసిపి క్యాడర్ గత 4 ఏళ్లుగా భారీ ప్యూహంతో అన్ని ఎన్నికలలో వరుసగా భారీ మెజారిటీలతో గెలుస్తూ వస్తుంది. కుప్పం అసెంబ్లీ పరిధిలో ఉన్న నాలుగు జడ్పీ టీసీ స్థానాలు వైసిపి గెలిచింది. కుప్పం నగర పంచాయతీలో కూడా వైసిపి ఘనవిజయం సాధించింది. ఆఖరికి కుప్పం మండలం లోని 29 పంచాయతీల్లో 25 చోట్ల వైసిపి గెలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *