సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణ జిల్లాలో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే , పారిశ్రామిక వేత్త దేవినేని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ లో టికెట్ కన్ఫమ్? అని తేలటంతో టీడీపీ లో చేరికకు రంగం సిద్ధం అయ్యింది. ఇటీవల సీఎం జగన్ తో తన సీటు కేటాయింపు విషయంలోనూ స్థానిక జిల్లా నేతలతో తనకున్న విభేదాలు తో తీవ్ర అసంతృప్తి తో ఉన్న వసంత ప్రసాద్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ లో చేరికను అధికారికంగా ధృవీకరించారు. తాను చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతానన్నారు. గతంలో వార్తలు ప్రచారంలో ఉన్నట్లు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కు తనకు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలూ లేవని.. ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదని నేటి నుంచి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలసికట్టుగా పని చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని స్పష్టం చేశారు.
