సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో రైల్వే ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున నేటి బుధవారం,ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- గుంటూరు(07783), గుంటూరు- విజయవాడ(07788), గుంటూరు- మాచర్ల(07779), గుంటూరు- విజయవాడ(07465), గుంటూరు- రేపల్లె(07786) రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. వీటితో పాటు భీమవరం మీదుగా వెళ్లే నర్సాపూర్- గుంటూరు-నర్సాపూర్(17282/17281) ట్రైన్లను కూడా విజయవాడ గుంటూరు మధ్య ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు,
