సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పవిత్ర పంచారామ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న గునుపూడి సోమారామం లో నేటి నుండి మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. నేటి బుధవారం ఉదయం 5- 30 ని. లకు శ్రీ సోమేశ్వరునికి రుద్రాభిషేకాలు ప్రారంభమయ్యాయి, భక్తులు విశేషంగా హాజరు అవుతున్నారు. ఈనేపథ్యంలో ఈ వార్షిక కళ్యాణోత్సవముల కు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను కార్యక్రమాలను, యమ్. విజయరాజు (ప్రాంతీయ సంయుక్త కమీషనరు, దేవదాయ ధర్మదాయ శాఖ, రాజమహేంద్రవరం) స్వయంగా వచ్చి పరిశీలన చేసి తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులైన ,కుర్మదాసు సత్యశ్రీనివాస్, నాచుశ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, నల్లం రఘుబాబు, చెల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి, డి రామకృష్ణంరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *