సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3 టౌన్ లో గత మంగళవారం రాత్రి, పి సి ఆర్ ప్రైడ్ నందు జరిగిన నరసాపురం పార్లమెంటరీ వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి గా ఎంపీ మరియు ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, పి వి మిథున్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే, ప్రసాదరాజు ఇంకా జిల్లాకు చెందిన వైసిపి ప్రజా ప్రతినిదులు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయిన వారికీ వైస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ , గూడూరి ఉమాబాల కృతజ్ఞలు తెలిపారు.
