సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శాసనమండలి మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ను భీమవరం గునుపూడి లోని ఆయన క్యాంపు కార్యాలయంలో నేడు బుధవారం డిఎస్పీ వి.నారాయణ స్వామి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా భీమవరం డివిజన్ శాంతిభద్రతల పరిస్థితులను మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు డి ఎస్పీ ని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో.. ఇకముందు చట్టపరంగా తీసుకోవలసిన చర్యలు.. ఎన్నికల నిర్వహణ తదితర విషయాలు వారి మధ్య సమీక్ష జరిగిందని భావించవచ్చు..
