సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తామంటు..అక్కడి నుండి గ్రీన్ సిగ్నెల్ రాకపోవడంతో పలు సార్లు పర్యటనలు వాయిదాలు వేసుకొన్న టీడీపీ అధినేత, చంద్రబాబు ఎట్టకేలకు నేటి గురువారం మధ్యాహ్నం కి ఢిల్లీ పయనమయ్యారు. చంద్రబాబు నివాసం ఉండే హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రాత్రి ఢిల్లీలో బీజేపీ(BJP) అగ్ర నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం నేటి గురువారం సాయంత్రం హైదరాబాద్ నుండి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం రాత్రి 8- 30 గంటలలోపు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 9 -30 గంటల తరువాత అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. వీరి భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తో పొత్తు ఉన్న లేకపోయినా సరే.. టీడీపీ, జనసేనలు రేపు శుక్రవారం మహాశివరాత్రి నేపథ్యంలో రెండోజాబితాను సైతం (బీజేపీ కలసి వస్తే .. లేకపోయిన ఏ విధంగా సీట్లలో అభ్యర్థులు) సిద్ధం చేసినట్లు సమాచారం..
