సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో పెరిగిపోయిన ధరలు నేపథ్యంలో ఎన్నికల ముగింట ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ..భారత్ రైస్.. అంటూ బియ్యం, గోధుమ పిండి, నూనె, నిత్యావసర సరుకులతో పాటు వంట గ్యాస్ ఫై కూడా ద్రుష్టి పెట్టింది. నేడు, శుక్రవారం మహాశివరాత్రి కానుకగా .. మహిళా దినోత్సవంనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజగా గుడ్ న్యూస్ చెప్పింది. 14న్నర కేజీల వంట గ్యాస్ సిలిండర్ (LPG Cylinder) పై రూ.100 తగ్గిస్తున్నామని, దీంతో లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుందని పేర్కొంది. వంటగ్యాస్ ధర తగ్గించడంతో మహిళలకు అండగా నిలిచినట్టు అవుతుందని ప్రకటించింది. ఉదాహరణకు హైదరాబాద్ లో ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 955గా ఉంది. రూ.100 తగ్గడంతో రూ.855కి చేరుతుంది. ఇంటికి చేరేందుకు 30 రూపాయల వరకు అందనపు ఖర్చు తప్పనిసరి..
