సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఏపి బహుజన జేఏసీ కార్యాలయం నందు నేటి, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సభ లో నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఇంఛార్జ్, గూడూరి ఉమాబాల, ఆమె భర్త జగదీష్ లను సన్మానించారు. గూడూరి ఉమాబాల మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజకీయాలలో మహిళలు కీలక పాత్ర పోషించాలని భావిస్తూ తనకు సీఎం జగన్ అందించిన సహకారం పార్టీ పరంగా ఇచ్చిన కీలక పదవి , గుర్తింపు గౌరవం మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బహుజన జేఏసీ వైస్ ప్రెసిడెంట్ బిరుదుగడ్డ రమేష్ బాబు, స్టేట్ జాయింట్ సెక్రటరీ దానం విద్యాసాగర్, స్టేట్ మహిళా మోనటరింగ్ అధ్యక్షులు పాలవెల్లి మంగ, ప.గో.జిల్లా కన్వీనర్ ఈది రవికుమార్, జిల్లా మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ చిగురుపాటి రాహేలు, జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ విప్పర్తి సత్యవేణి, భీమవరం మండల మహిళా అధ్యక్షురాలు సత్యాల శాంతకుమారి, తదితరులు పాల్గొన్నారు.
