సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 10 ఏళ్ళ క్రితం రాష్ట్ర విభజనతో ఏపీలో అడ్రస్ గల్లంతు అయిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో కాస్త ఓట్ల శాతం పెంచుకునేందుకు, తద్వారా వై యస్ షర్మిల నాయకత్వంలో సీఎం జగన్ ను అధికారం నుండి దింపేందుకు తమ వంతు పాత్ర పోషించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంర్భంగా కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్న 3 సభల్లో ఆయన పాల్గొంటారు. తొలి సభ మార్చి 11న విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నుండ‌గా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించ‌నున్నారు. ఈ బహిరంగ సభలకు జనసమీకరణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *