సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సీఎం జగన్ ఆదేశాల మేరకు గోదావరి జిల్లాల వైసీపీ ఇంచార్జి ఎంపీ మిదున్ రెడ్డి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ ను వైసీపీ లోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఆలోచించుకోవడానికి సమయం అడిగిన ముద్రగడ తాజాగా .. తాను తన కుటుంబ సభ్యులు ఈ నెల 14వ తేదీన సీఎం జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. తాను కానీ తన కుమారుడు గిరిబాబు కానీ ఎటువంటి పదవులు ఆశించి వైసీపీ లో చేరటంలేదని, రాష్ట్రంలో వైసీపీ పార్టీ పాలనకు మద్దతు గా సీఎం జగన్ కోసం వచ్చే ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని ముద్రగడ పద్మనాభం ప్రకటించడం విశేషం..
