సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అశేషంగా ఉన్న కృష్ణ & మహేష్ బాబు అభిమానులు సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి నిలువెత్తు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 12 వ తేదీ, మంగళవారం ఉదయం 11-30 ని.లకు ఏర్పాటు చేశామని సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమాని, ప్రముఖ లాయర్ రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి తెలిపారు. స్థానిక గవర్నమెంటు హాస్పిటల్ రోడ్ లో కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా ఎడ్వర్డ్ చెరువును ఆనుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.ఆరోజు ఉదయం 9-30 ని.లకు స్థానిక పద్మాలయా ధియేటర్ వద్ద నుండి భారీ వూరేగింపు ప్రారంభమై విగ్రహం వరకు కొనసాగుతుంది.అనంతరం విగ్రహావిష్కరణ కార్యక్రమం తరువాత అక్కడే సమీపంలో లో వున్న త్యాగరాజ భవనంలో సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కావున కృష్ణ మహేష్ అభిమానులు విశేషంగా పాల్గొనాలని కోరుతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటించిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ,, ఇప్పటికే రాష్ట్రా వ్యాప్తంగా ఎన్నో ప్రధాన సెంటెర్స్ లో ‘మంచి మనిషి’ కి పర్యాయపదం కృష్ణ విగ్రహాలు అభిమానులు నెలకొల్పటం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *